వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య’ అంటూ దశాబ్దాలపాటు తెలుగువారిని తన కంచుకంఠంతో అలరించిన ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత దుగ్గిరాల పూర్ణయ్య(83) ఆదివారం మృతి చెందారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని తన స్వగృహంలో ఆయన వయోభారంతో కన్నుమూశారు. 1950వ దశకం నుంచి చాల ఏళ్లపాటు ఆయన ఆలిండియా రేడియో(దిల్లీ)లో స్పష్టమైన తెలుగు వాచకంతో వార్తలు చదివారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన దాదాపు 25 ఏళ్లుగా తన స్వగ్రామమైన అంగలూరులోనే భార్య అనంతలక్ష్మితో కలిసి నివసిస్తున్నారు. గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. పూర్ణయ్య మృతికి సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
రేడియో వ్యాఖ్యాత దుగ్గిరాల పూర్ణయ్య మృతి
ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత దుగ్గిరాల పూర్ణయ్య ఆదివారం మరణించారు. కృష్ణా జిల్లా అంగలూరులోని ఆయన స్వగృహంలో వయోభారంతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.
రేడియో వ్యాఖ్యాత దుగ్గిరాల పూర్ణయ్య మృతి