ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీకాల కోసం ప్రజల బారులు.. అరకొరగా సరఫరా - అవనిగడ్డలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ తాజా వార్తలు

కరోనా నిరోధక టీకాల కోసం ఆస్పత్రులకు జనం పోటెత్తుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొవిడ్ టీకా తీసుకోవడానికి ప్రజలు తరలివచ్చారు. అరకొరగా టీకా సరఫరా చేస్తున్న కారణంగా... వచ్చిన వారికి నచ్చజెప్పడం అధికారులకు ఇబ్బందిగానే ఉంది.

corona vaccination at avanigadda
corona vaccination at avanigadda

By

Published : May 5, 2021, 4:28 PM IST

కొవిడ్‌ టీకా తీసుకోవడానికి సాధారణ ప్రజలు ముందుకొస్తున్నారు. మొదట టీకా వేసుకోవడానికి సంకోచించినా వైద్యశాఖ అధికారుల అవగాహన కార్యక్రమాలు, కేసు ఎక్కువుతున్నందున.. ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొవిడ్ టీకా తీసుకోవడానికి ప్రజలు భారీగా వచ్చారు. పెద్దఎత్తున గుంపులుగా చేరి, టీకాలు కావాలంటూ వైద్యసిబ్బందిని కోరుతున్నారు. కొద్దిమొత్తం వస్తున్న టీకాల కోసం పెద్దఎత్తున వస్తున్న ప్రజలకు ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితిని వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details