కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురుకి గాయాలయ్యాయి. ఓ వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో రెండు పార్టీల మధ్య స్వల్ప వివాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. పేరకలపాడు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పేరకలపాడులో ఉద్రిక్తత... పలువురికి గాయాలు - elections in krishna district
కృష్ణా జిల్లా పేరకలపాడులో ఉద్రిక్తత నెలకొంది. ఓ వృద్ధురాలు తన ఓటును వినియోగించుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
పేరకలపాడులో ఉద్రిక్తత