తెలంగాణలోని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్( పీవీపీ)కు నోటీసులిచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బందిని ఫిలీంనగర్లోని నివాసం వద్ద కాపలాగా ఉంచారు.
బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 14లో నిర్మించిన విల్లాలోని ఒకదాన్ని ఏడాదిన్నర క్రితం పీవీపీ.. విక్రమ్ కైలాశ్కు విక్రయించారు. ఇంటిపై భాగంలో నిర్మాణాలు చేపడుతుండగా పీవీపీతోపాటు 15 మంది అనుచరులు వెళ్లి అడ్డుకున్నారు.