టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజని, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజులు గవర్నర్‌ను కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అనంతరం ముగ్గురు క్రీడాకారులను గవర్నర్ ఘనంగా సత్కరించారు. సింధు గెలిచిన పతకాన్ని వీక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని గవర్నర్ హరిచందన్ కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సింధుకు.. క్రీడాభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.