వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఎర్రకలువలు, మందారాలతో పుష్పార్చన చేశారు. రుత్వికులు కనుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పుష్పాలను మూలవిరాట్ వద్ద ఉంచి పూజ జరిపారు. అనంతరం మేళతాళాలతో వాటిని భక్తులు ప్రదర్శనగా ఉత్సవమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
ఎర్రకలువలు, మందారాలతో ముగ్గురమ్మల మూలపుటమ్మ ముస్తాబు - విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు వసంత నవరాత్రి ఉత్సవాలు తాజా వార్తలు
ఎర్రకలువలు, మందారాలతో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ముస్తాబు చూసి భక్తులు పరవశించారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. పుష్పార్చన కన్నులపండువగా నిర్వహించారు.
దుర్గమ్మకు పుష్పార్ఛన
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తుల సమక్షంలో అమ్మవారికి అర్చన చేశారు. అనంతరం దుర్గమ్మకు పంచహారతులను సమర్పించారు. గత 11 ఏళ్లుగా క్రమం తప్పకుండా అమ్మవారికి దాత బడుగు వెంకటేశ్వరరావు.. పుష్పార్చన కోసం అవసరమైన పూలను అందజేస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి...
విచిత్రం.. 20 అడుగుల ఎత్తు.. రెండేళ్లుగా కాపు..
Last Updated : Apr 16, 2021, 8:22 PM IST