కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై సర్కారు దృష్టి సారించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ రకానికి క్వింటాలు రూ.1,940, గ్రేడు-ఏ రకానికి రూ.1,960గా కనీస మద్దతు ధర చెల్లించాలని ఆదేశించింది. ఈ వివరాలను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టరు కె.మాధవీలత(krishna district jc madhuveelatha) వెల్లడించారు.
మద్దతు ధర పొందేందుకు రైతులు తగిన నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు సిద్ధమైతే.. వారి పంట వివరాలను భరోసా కేంద్రాల్లో తెలియజేయాలని చెప్పారు. సాంకేతిక సిబ్బంది ధాన్యం నాణ్యత పరిశీలిస్తారని మీదట.. ధాన్యం ఎప్పుడు తరలించాలనేది తెలియజేస్తూ కూపన్లు అందజేస్తారని మాధవీలత తెలిపారు.