భాజపా జాతీయ కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పురందేశ్వరి, డీకే అరుణకు జాతీయ కార్యవర్గంలో చోటుదక్కింది. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ... జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి నియమితులయ్యారు.
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
రాష్ట్ర భాజపా నాయకురాలు పురందేశ్వరికి ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించారు. తెలంగాణ నాయకురాలు డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ప్రకటించారు.
Purandeshwari
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డా.కె.లక్ష్మణ్ నియామకమయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగనున్నారు. మరోవైపు ప్రధాన కార్యదర్శుల జాబితాలో రామ్ మాధవ్, మురళీధర్‌రావు పేర్లు చేర్చలేదు. అలాగే జాతీయ అధికార ప్రతినిధుల జాబితాలో జీవీఎల్ నర్సింహారావు పేరు లేదు.