కృష్ణా జిల్లా కొండపల్లి.. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి.! శతాబ్దాల నుంచి కొండపల్లి బొమ్మలు ఇక్కడ కళాకారుల చేతిలో ప్రాణంపోసుకుంటున్నాయి. ఈ బొమ్మలకు,... దేశ, విదేశాల్లో ఆదరణ ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కొండపల్లి కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. కరోనా రక్కసి..కొండపల్లి కొయ్యబొమ్మల వ్యాపారాన్ని దెబ్బతీసింది. లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా వ్యాపారాలు కళతప్పాయి. బొమ్మల తయారీపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి.
కరోనా వల్ల శిల్పారామం, లేపాక్షి దుకాణాలు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాలకూ రవాణా లేక అమ్మకాలు నిలిచిపోయాయి. కొండపల్లి ఖిల్లా కూడా మూసేయడంతో పర్యాటకులు రావడం మానేశారు. ఫలితంగా వ్యాపారం జరగడంలేదు.
KONDAPALLY: కొండపల్లి బొమ్మల తయారీ రంగంపై కొవిడ్ పిడుగు - kondapally Puppet artists in trouble
కొండపల్లి కొయ్యబొమ్మల కళాకారులపై కరోనా పిడుగుపడింది. వ్యాపారాలు దెబ్బతిని జీవనోపాధికి గండిపడింది. వరుసగా రెండో ఏదాదీ అమ్మకాలు లేక..తయారు చేసిన కళాకృతులు అలాగే ఉండిపోయాయి. దుకాణాల్లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు కొందరు ఇతరత్రా పనులు చూసుకుంటున్నారు.
కొండపల్లి బొమ్మల తయారీ రంగంపై కొవిడ్ పిడుగు
గతంలో మాదిరిగా నాణ్యమైన కలప దొరకడం కూడా కష్టమైందని కళాకారులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో తమ వారసులు ఎవరూ ఈ కళ నేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న బొమ్మల తయారీ కళ తమ తరంతోనే అంతరించేపోయే ప్రమాదముందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప భవిష్యత్ తరాలకు కొండపల్లి కొయ్యబొమ్మలు కనిపించే అవకాశం లేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: