వచ్చే ఆర్ధిక సంవత్సరం రాష్ట్రంలో మరికొన్ని కొత్త శాఖలతో తమ పరిధిని మరింత విస్తరింపజేయనున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ అశుతోష్ చౌదరి తెలిపారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 25 శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు విజయవాడలో మీడియాకు తెలిపారు.
కొత్త ఆర్థిక సంవత్సరం.. 25 కొత్త శాఖలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ - విజయవాడ వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 25 శాఖలను ఏర్పాటుచేసి తమ సేవలను విస్తరించనున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమలకు, వ్యవసాయానికి అందిస్తున్న రుణాల గురించి ఆయన వివరించారు.

25 కొత్త శాఖలు ఏర్పాటు
రాష్ట్రంలో 160 బ్రాంచిలతోపాటు 200 ఏటీఎంల ద్వారా ఖాతాదారులకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థ విజయవాడ సర్కిల్ పరిధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు అందిస్తోందని.. విశాఖ సర్కిల్ పరిధిలో చిన్నతరహా పరిశ్రమలకు రుణాలు మంజూరు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రేపు సీఎం జగన్ చేతుల మీదుగా 'బియ్యం పంపిణీ వాహనాలు' ప్రారంభం