పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఇంతకుముందు వేయించినా, తిరిగి వేయించవచ్చని గవర్నర్ సూచించారు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి' - ap governer latest news
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. 2011నుంచి దేశంలో ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. "రెండు చుక్కలు నిండు ప్రాణం" అనే నినాదంతో పల్స్ పోలియోను నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమం
"రెండు చుక్కలు నిండు ప్రాణం" అనే నినాదంతో పల్స్ పోలియోను నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. విజయవాడ గిరిపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2009 నుంచి జిల్లాలో పోలియో కేసు నమోదు కాలేదని వివరించారు.
ఇదీ చదవండి