ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత నియోజకవర్గంలో.. మంత్రి వెల్లంపల్లికి చేదు అనుభవం! - విజయవాడలో మంత్రి వెల్లంపల్లికి ప్రశ్నలు

విజయవాడ నగరపాలకసంస్థ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​కు చేదు అనుభవం ఎదురైంది. రేషన్ బియ్యం, వృద్ధాప్య పింఛను, కరెంట్​ బిల్లుల సమస్యతో పాటు... ప్రభుత్వ పథకాల అమలు పట్ల మంత్రిని నిలదీశారు. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.

Public questions to Minister Vellampalli who went on election campaign  at vijayawada
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లికి చేదు అనుభవం

By

Published : Feb 19, 2021, 12:03 PM IST

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లికి చేదు అనుభవం

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ను ప్రజలు ప్రశ్నలతో ముంచెత్తారు. తన సొంత నియోజకవర్గం 50వ డివిజన్ అభ్యర్థిని వెంట పెట్టుకుని తిరుగుతున్న దేవాదాయశాఖ మంత్రికి విముఖత ఎదురైంది. ఇంటింటికీ రేషన్ బియ్యం అని... ఇలా ఎండలో నిలబెట్టారంటూ ఆ వాహనం దగ్గరకు ఓట్లు అడగడానికి వెళ్లిన మంత్రిని చుట్టుముట్టారు.

వృద్ధురాలు, ఒంటరి మహిళకు వృద్ధాప్య పింఛను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పాకకు 300 కరెంట్ బిల్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవన్నీ ఎక్కడినుంచి తీసుకు రావాలని వాపోయారు. వాళ్లు నిలదీస్తుంటే... ఎన్నికలయ్యాక చూద్దాం అంటూ మంత్రి ముందుకు సాగారు. ఇలా.. తాను గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రజలు సమస్యలతో ఏకరువు పెట్టారు ఓటర్లు.

ABOUT THE AUTHOR

...view details