కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని రాంకో సిమెంట్ పరిశ్రమ విస్తరణకు సంబంధించి.. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
రాంకో సిమెంట్ పరిశ్రమ విస్తరణకు.. కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ - కృష్ణా జిల్లాలో రాంకో సిమెంట్ పరిశ్రమ విస్తరణ
కృష్ణా జిల్లాలో రాంకో సిమెంట్ పరిశ్రమ విస్తరణకు.. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. పరిశ్రమల విస్తరణల్లో ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు.
![రాంకో సిమెంట్ పరిశ్రమ విస్తరణకు.. కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ public hearings on ramco cement industries expansion in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10339303-531-10339303-1611315039691.jpg)
జగ్గయ్యపేట పట్టణంతో పాటు పరిశ్రమలున్నా జయంతిపురం, వేదాద్రి గ్రామాల్లో.. పలు పార్టీల నాయకులు, పర్యావరణ వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని కాలుష్యం గురించి చర్చించారు. పరిశ్రమల విస్తరణల్లో ఉద్యోగావకాశాలు స్థానికులకే కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ నుంచి వెదజల్లే కాలుష్యాన్ని నివారించేందుకు.. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రధానంగా జగ్గయ్యపేట పట్టణంలో.. పరిసర గ్రామాల్లో గాలి, నీరు కలుషితం అవుతుండటంతో పరిశ్రమ యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురి అరెస్ట్