ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాంసం కోసం నున్న గ్రామానికి బారులు తీరిన నగరవాసులు - విజయవాడ నున్న గ్రామం తాజా వార్తలు

విజయవాడ గ్రామీణం నున్న గ్రామంలో మాంసం దుకాణం వద్ద జనాలు బారులు తీరారు. నగరంలో మునిపల్ అధికారులు మాంసం దుకాణాలు మూయించటంతో వందలాది మంది నగరవాసులు నున్న మాంసం దుకాణాల వద్దకు క్యూ కట్టారు.

మాంసం కోసం నున్న గ్రామానికి బారులు తీరిన నగరవాసులు
మాంసం కోసం నున్న గ్రామానికి బారులు తీరిన నగరవాసులు

By

Published : Apr 25, 2021, 10:49 AM IST

విజయవాడలో మాంసం దుకాణాలపై ఆంక్షలు ఉండటంతో నున్న గ్రామానికి నగరవాసులు బారులు తీరారు. గ్రామపంచాయతీ సిబ్బంది మామూళ్ల మత్తులో దుకాణల వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు. కొవిడ్ రెండో దశ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మాంసం దుకాణాల ముందు క్యూకట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నగర శివారు కాలనీలలో, నున్న గ్రామంలో కొవిడ్ మరణాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అధికారులు కొవిడ్ నిబంధనలు అమలు చేయకుండా ఉండటం సరికాదన్నారు.

ఇదీ చదవండి:దొంగలు బాబోయ్‌.. దొంగలు!

ABOUT THE AUTHOR

...view details