వలస కార్మికులకు అండగా నిలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. విజయవాడలో నడుచుకుంటూ వెళ్లే కార్మికుల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భోజన సదుపాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో రోజు కొకరుగా దాతలు కార్మికులకు ఆహారం అందిస్తున్నారు.
నగరంలోని కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్, రామవరప్పాడు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల వద్ద నిత్యం భోజనం అందిస్తున్నారు. బెంజి సర్కిల్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన భోజన సదుపాయ కేంద్రంలో కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో పండ్లు, పులిహోర, భోజనం అందజేశారు. నిత్యం 500 మందికి భోజనం పెడుతున్నట్లు తెలిపారు.