- ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలి: బాలకృష్ణ
- హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది: బాలకృష్ణ
- సత్యసాయి జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలి: బాలకృష్ణ
- భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉంది: బాలకృష్ణ
Live Updates: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.. పలుచోట్ల నిరసనలు - ఏపీ తాజా వార్తలు
![Live Updates: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.. పలుచోట్ల నిరసనలు protests against the formation of new districts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14294398-822-14294398-1643266592030.jpg)
14:58 January 27
హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలి: బాలకృష్ణ
14:58 January 27
నర్సీపట్నంను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
- కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై విశాఖ జిల్లాలో నిరసనలు
- విశాఖ: నర్సీపట్నంను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
- మంత్రి, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యే ఉమాశంకర్
14:58 January 27
విశాఖ జిల్లాలో కలపాలని వైకాపా నేతల డిమాండ్
- శృంగవరపుకోటను విశాఖ జిల్లాలో కలపాలని వైకాపా నేతల డిమాండ్
- విశాఖ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోట
- ఎస్.కోటను విజయనగరం జిల్లాలో కలుపుతున్నట్లు ప్రభుత్వ ప్రతిపాదన
- ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన వైకాపా నాయకులు
- ఎస్.కోటకు విశాఖ అన్ని విధాలుగా అనుకూలమన్న నేతలు
12:29 January 27
జిల్లాల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలి: సోము వీర్రాజు
- ప్రభుత్వం 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామంటోంది: సోము వీర్రాజు
- బస్టాండ్‌కు దిక్కులేదు జిల్లాకో విమానాశ్రయం అంటున్నారు: సోము వీర్రాజు
- జిల్లాల పెంపు విషయంలో ప్రజాభిప్రాయం సేకరించాలి: సోము వీర్రాజు
- జిల్లాల పెంపుపై కమిటీ వేసి ప్రజల కోరిక తెలుసుకోవాలి: సోము వీర్రాజు
12:29 January 27
ప్రకాశం జిల్లాలోనూ అసంతృప్తి సెగలు
- కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకాశం జిల్లాలోనూ అసంతృప్తి సెగలు
- కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై తీవ్ర వ్యతిరేకత
- కందుకూరును ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని డిమాండ్
- కందుకూరు డివిజన్‌ను యథాతథంగా ఉంచాలని అఖిలపక్షం డిమాండ్
- మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళనలు
- ఉద్యమానికి సిద్ధమవుతున్న మార్కాపురం జిల్లా సాధన సమితి
- సాయంత్రం కార్యాచరణ ప్రకటించనున్న జిల్లా సాధన సమితి
12:29 January 27
రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతోంది: వైకాపా మున్సిపల్ ఛైర్మన్
రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతోంది: వైకాపా మున్సిపల్ ఛైర్మన్
వనరులు ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమని గ్రహించాలి: శ్రీనివాసులరెడ్డి
శాంతియుత నిరసన తెలిపి జిల్లా సాధించుకోవాలి: వైకాపా మున్సిపల్ ఛైర్మన్
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి: వైకాపా మున్సిపల్ ఛైర్మన్
12:22 January 27
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు.. పలుచోట్ల నిరసనలు
- కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలుచోట్ల నిరసనలు
- రాజంపేటకు అన్యాయం జరిగిందని వైకాపా నేతల్లో అసంతృప్తి
- రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థుల డిమాండ్
- జిల్లా కేంద్రంగా రాయచోటిని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన
- జిల్లా కేంద్రంగా రాయచోటిని వ్యతిరేకిస్తూ వేలమంది విద్యార్థుల నిరసన
- రాజంపేటలో 3 వేల మందికి పైగా విద్యార్థుల ఆందోళన
- వైకాపా మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన