కృష్ణా జిల్లా నందిగామ ఇంజనీరింగ్ విభాగంలో దశాబ్ద కాలంగా పనిచేసే వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికులు వాటర్ సప్లై ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. సెమీ స్కిల్డ్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా..

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ కార్యదర్శి కే.గోపాల్ డిమాండ్ చేశారు. కరోనా సమయంలో అదనపు అలవెన్సులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఏసోబు, కార్మికులు శ్రీను, రవి, రమేష్ దాసు బ్రహ్మం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.