'మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు' అంటూ కృష్ణాజిల్లా గన్నవరంలో తెదేపా, అమరావతి ఐకాస, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమైందని అమరావతి మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెదేపా జిల్లాఅధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మహిళలు, రాజధాని మద్దతు దారులు పాల్గొన్నారు.
అమరావతికి మద్దతుగా గన్నవరంలో నిరసన - అమరావతి తాజా వార్తలు
అమరాతికి మద్దతుగా కృష్ణాజిల్లా గన్నవరంలో తెదేపా, అమరావతి ఐకాస, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతికి మద్దతుగా గన్నవరంలో నిరసన !