ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వాలకూ అప్పులున్నాయ్.. వాటినీ ప్రైవేటీకరిస్తారా?' - విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నష్టాల్లో ఉందని సాకు చూపి ప్రైవేటుపరం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

protest on steel
protest on steel

By

Published : Feb 17, 2021, 4:26 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా నందిగామలో.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ అన్నారు. కర్మాగారం నష్టాల్లో ఉందని సాకు చూపి.. ప్రైవేటుపరం చేయటం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్పుల్లో.. ఉన్నాయని వాటిని కూడా ప్రైవేటుపరం చేస్తారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details