ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ బిల్లుల కోసం ఎంపీపీ, సర్పంచుల నిరసన - dharna for upadhihami bill in vijayawada

విజయవాడ ధర్నాచౌక్​లో సర్పంచులు, ఎంపీపీలు నిరసన చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.

విజయవాడలో ధర్నాచౌక్​లో ఉపాధిహామి బిల్లుకోసం నిరసన

By

Published : Nov 11, 2019, 6:30 PM IST

ఉపాధి హామీ బిల్లుల కోసం ఎంపీపీ, సర్పంచుల నిరసన

ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను చెల్లించాలంటూ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీల సంఘాల నాయకులు విజయవాడ ధర్నాచౌక్​లో ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలానికి 2 వేల 500 కోట్ల రూపాయల బకాయిలను 5 నెలల క్రితం విడుదల చేస్తే వాటిని సంబంధిత శాఖలకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్య పరిష్కరించకపోతే ఛలో అమరావతి, ఛలో దిల్లీకి పిలుపునిచ్చి పార్లమెంటును ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details