కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సచివాలయం-2 వద్ద స్థానికులు ఇళ్ల పట్టాల కోసం నిరసన వ్యక్తంచేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మాగంటి వెంకటేశ్వరావు అన్నారు. లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామన్నారు.
అర్హత ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరసన - కంచికచెర్ల మండలం పరిటాల వార్తలు
ఇళ్ల పట్టాల కోసం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో స్థానికులు నిరసనకు దిగారు. అర్హత ఉన్నా తమకు పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు.

ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరసన