దేశవ్యాప్తంగా రైతులు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతిస్తామని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర రైతు సంఘం నిరసన చేపట్టింది. కృష్ణాజిల్లా మైలవరం సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మైలవరం పరిధిలో టోల్ ప్లాజాల వద్ద రైతు సంఘాల నిరసన - protest at toll plazas news
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రాష్ట్ర రైతు సంఘం చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కృష్ణాజిల్లా మైలవరం పరిధిలో టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
టోల్ ప్లాజాల వద్ద రైతు సంఘాల నిరసన
కేంద్రం మొండి వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని జమలయ్య అన్నారు. ఈ చట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సీఐటీయూ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైతుల నిరసనలతో మూతపడ్డ టోల్‌ప్లాజాలు