కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటానికి మద్దతుగా కృష్ణా జిల్లా కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆందోళన జరిగింది. రైతు సంఘాలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసి వీరులపాడు తరలించారు.