వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొమరవోలులో నిరసన తెదేపా అధినేత చంద్రబాబు భార్య.. నారా భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. వైకాపా నేతల వ్యాఖ్యలను ఖండించారు. నారా భువనేశ్వరి అమ్మమ్మ గ్రామమైన కృష్ణా జిల్లా కొమరవోలులో తెదేపా కార్యకర్తలు, గ్రామస్తులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా సభ్యుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన ధర్నా(Protest Against YCP Comments at komaravolu) నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నాను అడ్డుకోడంతో.. పోలీసులు, తెదేపా నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా ఇన్ఛార్జీ వర్ల కుమార్ రాజా, పార్టీ నాయకులను రోడ్డుపై నుంచి పోలీసులు లాగేశారు. కొమరవోలు భువనేశ్వరి దత్తత గ్రామం కావడంతో.. ధర్నాలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని ఎన్టీఆర్-బసవతారకం విగ్రహాలకు పార్టీ నాయకులు(tdp protest at komaravolu) క్షీరాభిషేకాలు నిర్వహించారు.
ఈ ధర్నాలో తెదేపా నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పామర్రు తెదేపా ఇన్ఛార్జీ వర్ల కుమార్ రాజా(tdp leaders protest against YCP leaders comments) పాల్గొన్నారు. చంద్రబాబు కంట కన్నీరుతో ప్రపంచంలోని తెలుగువారంతా ఆవేదన వ్యక్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యానించారు. మంత్రులు కొడాలి నాని ,పేర్ని నాని, ఎమ్మెల్యేలకు ప్రజల తరపున హెచ్చరిస్తున్నామని తెల్చిచెప్పారు. రాష్ట్రంలో నరకాసురుడి పరిపాలన జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు పునాదులు వేస్తే.. విధ్వంసానికి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడని దుయ్యబట్టారు.
వైకాపా నేతల వ్యాఖ్యలపై గ్రామస్తుల ఆగ్రహం..
భువనేశ్వరిపై వైకాపా నేతల అనుచిత(komaravolu village fire ycp comments on nara bhuvaneshwari) వ్యాఖ్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ప్రజలతో మమేకమై సేవచేసే నారా భువనేశ్వరిని గురించి అవమానకరంగా మాట్లాడటం బాధాకరం అన్నారు. రాజకీయ స్వలాభం కోసం ఇలా మాట్లాడటం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మహామనిషిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ తరహా వ్యాఖ్యలు మళ్లీ చేస్తే వారికి తగిన బుద్ధి చెబుతామని గ్రామస్తులు, మహిళలు హెచ్చరించారు.
ఇదీ చదవండి..