ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మద్యం విక్రయాలను ఆపివేయాలి' - కృష్ణా జిల్లా నేటి వార్తలు

కృష్ణా జిల్లా నందిగామలో సీఐటీయూ, డీవైఎఫ్ఐ, యస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.

protest against wine selling in nandhigama krishna district
తహసీల్దార్​కు వినతి పత్రం అందజేత

By

Published : May 6, 2020, 3:12 PM IST

మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, డీవైఎఫ్ఐ, యస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నందిగామలో నేతలు నిరసన చేశారు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస జాగ్రత్తలు పాటించకుండా మందుబాబులు దగ్గర దగ్గరగా నిలబడటం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details