ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొక్లైనర్​తో సహా మట్టిలో కూరుకుపోయిన ఆపరేటర్ - విజయవాడలో ప్రొక్లైనర్ ప్రమాదం వార్తలు

గ్రావెల్ తవ్వుతుండగా ప్రొక్లైనర్​పై ఒక్కసారిగా కొండపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ప్రొక్లైనర్​తో పాటు దాని ఆపరేటర్ కూడా మట్టిలో కూరుకుపోయాడు. కూలీలు గుర్తించి అతన్ని బయటకు తీశారు.

Procliner operator stuck in the soil
Procliner operator stuck in the soil

By

Published : Jun 21, 2020, 6:35 AM IST

విజయవాడ రూరల్ మండలం పరిధిలోని జక్కంపూడి, షాబాద గ్రామాల సమీపంలో ప్రమాదం జరిగింది. సర్వే నంబర్​ 85లో గ్రావెల్ తవ్వుతుండగా ప్రొక్లైనర్​పై ఒక్కసారిగా కొండపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రొక్లైనర్‌ ఆపరేటర్​ మట్టిలో కూరుకుపోయాడు. అక్కడే కూలీపనులు నిర్వహిస్తున్న వారు అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీశారు. మట్టిలో కూరుకుపోయిన ప్రొక్లైనర్​ను ‌మరో ప్రొక్లైనర్​తో బయటకు తీశారు.

ప్రొక్లైనర్​తో సహా మట్టిలో కూరుకుపోయిన ఆపరేటర్

ఇటీవల కాలంలో జక్కంపూడి, షాబాద, కొత్తూరు, తాడేపల్లి ప్రాంతాల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details