ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌లో కొత్త వాహనదారులకు కష్టాలు

Registration Problems: కొత్త వాహనదారులకు హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) నంబర్లపై వెళ్తుంటే ఆపి.. నెలరోజులు దాటినా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదు.. కేసు రాస్తామంటూ బెదిరిస్తున్నారు. మరికొందరేమో ‘విత్‌ అవుట్‌ నంబర్‌ ప్లేట్‌’ అంటూ కేసులు రాస్తున్నారు. వాహనదారులు ఎంత మొర పెట్టుకున్నా.. పోలీసులు వినకుండా వారి పని వారు చేసుకుపోతున్నారు. దీంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.

హైదరాబాద్‌లో కొత్త వాహనదారులకు కష్టాలు.
హైదరాబాద్‌లో కొత్త వాహనదారులకు కష్టాలు.

By

Published : Nov 29, 2022, 3:24 PM IST

Registration Problems: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్త బండ్లు కొంటున్న వాహనదారులకు రవాణాశాఖ చుక్కలు చూపిస్తోంది. బైకులు, కార్లు కొన్న తర్వాత బండి రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారాలు, నెలలు దాటినా స్లాట్‌ లభించడం లేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) నంబర్లపై వెళ్తుంటే కొందరు ట్రాఫిక్‌ పోలీసులు ఆపి.. నెలరోజులు దాటినా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదు.. కేసు రాస్తామంటూ బెదిరిస్తున్నారు. మరికొందరు ట్రాఫిక్‌ పోలీసులు ‘విత్‌అవుట్‌ నంబర్‌ ప్లేట్‌’ అంటూ కేసులు రాస్తున్నారు.

స్లాట్‌లు దొరకడం లేదంటూ వాహనదారులు చెబుతున్నా వినడం లేదు. రవాణా శాఖ సర్వర్‌లో స్వల్ప ఇబ్బందుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. రోజువారీ స్లాట్ల సంఖ్య పెంచాలంటూ ఉన్నతాధికారులకు విన్నవించామంటూ రంగారెడ్డి, మేడ్చల్‌ రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించేంత వరకూ కొత్త వాహనాలు కొంటున్నవారికి ఇబ్బందులు వస్తూనే ఉంటాయా? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

సిబ్బంది కొరత:వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగా ఐదు కార్యాలయాల్లో స్లాట్లను పెంచుతుండగా మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కార్యాలయాల్లో ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన స్లాట్లు లభించడం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటుంటే.. నెలరోజుల తర్వాత తేదీలు వైబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. మరోవైపు రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కొరత వల్లే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది.

ఆర్టీఏ ఏజెంట్ల హస్తలాఘవం:వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు సకాలంలో ఇప్పిస్తామంటూ కొందరు ఆర్టీఏ ఏజెంట్లు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. సర్వర్‌ సాయంతో కాస్త, అటూ, ఇటుగా బ్లాక్‌ చేస్తున్నారు. స్లాట్లు కనిపించడం లేదంటూ రవాణాశాఖ కార్యాలయాలకు వస్తున్న వారితో మాట్లాడుకుంటున్నారు. లైసెన్స్‌ ఫీజుకంటే కాస్త ఎక్కువగా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ రెండు రోజుల్లో ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్లు... (రోజుకు సగటున):

  • హైదరాబాద్‌: 350
  • మేడ్చల్‌: 475
  • రంగారెడ్డి: 500

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details