కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో స్వయంభూ శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అది, మంగళ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కుబడులు తీర్చుకుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా భక్తులు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
ప్రధానంగా మోపిదేవి ఆలయంలో... స్వామి దర్శనంతో సంతానం లేని వారికి సంతానం కలగడం, నేత్ర దోషాలు, శత్రు భయాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, కుట్టుపోగులు, తలనీలాలు, ఉయ్యాల సేవలు ఆలయంలో ఎక్కువగా జరుగుతాయి.
పిల్లలను గుడి బయట వదిలి వెళ్లలేకపోతున్నాం
ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. కొవిడ్ 19 కారణంగా... కొన్ని నెలల పాటు ఆలయాన్ని మూసివేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేవాదాయశాఖ అధికారులు 10 సంవత్సరాల లోపు పిల్లలు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులను ఆలయంలోకి అనుమతించకూడదని షరతులు విధించారు.