ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం..?

రాష్ట్రంలో క్రమేణా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు అందరినీ కలవరపెడుతున్నాయి. దీన్ని కట్టడి చేయాలంటే త్వరితగతిన ఎక్కువమందిని పరీక్షించి.. పాజిటివ్‌ కేసులు స్పష్టంగా గుర్తించడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో 6 ప్రయోగశాలలు మాత్రమే అందుబాటులో ఉండడం వల్ల వైరస్​ ను నిర్ధారించడం ఆలస్యమవుతోందని వీటి సంఖ్య పెంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా నిర్ధారించే ల్యాబ్​లు​ ఎన్నో తెలుసా..?
రాష్ట్రంలో కరోనా నిర్ధారించే ల్యాబ్​లు​ ఎన్నో తెలుసా..?

By

Published : Apr 3, 2020, 5:25 PM IST

Updated : Apr 3, 2020, 6:15 PM IST

ల్యాబ్​ల సంఖ్య పెంచడం అవసరమన్న నిపుణులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసుల తీవ్రతకు తగ్గట్లు నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రయోగశాలల్లో మాత్రమే రోజుకు 570 నమూనాలు పరీక్షిస్తున్నారు. విజయవాడ సిద్దార్థ, తిరుపతి స్విమ్స్‌, కాకినాడ, అనంతపురం, గుంటూరు, కడప బోధనాసుపత్రుల్లో మాత్రమే నమూనాలను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఒక పరీక్ష ప్రారంభించిన ఐదారు గంటలకు కానీ ఫలితాలు రావడం లేదు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి పొందిన ప్రయోగశాలల్లోనే పరీక్షలు జరగాల్సి ఉన్న కారణంగా ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.

11 రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్​లకు అనుమతి

దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు ల్యాబ్​లకు అనుమతులిచ్చినా.. ఈ జాబితాలో రాష్ట్రానికి చోటు దక్కలేదు. ఒక్కో అత్యాధునిక ల్యాబ్‌ను కేవలం 2 నుంచి 3 కోట్ల రూపాయలతో అందుబాటులోకి తీసుకురావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఏపీలో ఏర్పాటు చేస్తే కరోనా కేసుల సంఖ్యను త్వరగా గుర్తించడం సహా నివారణ చర్యలను వేగవంతం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో ఇలా..

రాష్ట్రం అందుబాటులో ఉన్న ల్యాబ్​లు
తెలంగాణ 15
మహారాష్ట్ర 23
తమిళనాడు 17
కేరళ 12

మన రాష్ట్రంలో ఈ సంఖ్య 6కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నిర్మూలించాలంటే మూలాల్లోకి వెళ్లి శోధించేందుకు ఈ ప్రయోగశాలలు ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ల్యాబ్​ల సంఖ్య పెరిగితే సమయం సహా రోగులపైనా ఖర్చు భారం తగ్గుతుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో మరో 12 కరోనా కేసులు.. తొలి మరణం

Last Updated : Apr 3, 2020, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details