విజయవాడ పటమట నిర్మలా కాన్వెంట్ రోడ్డులో నూతన ప్రియ ఫుడ్స్ దుకాణాన్ని ప్రారంభించారు. నగరంలో ఇది రెండోది కాగా తెలుగు రాష్ట్రాల్లో 53వ దుకాణం. నాణ్యమైన ఉత్పత్తులకు ప్రియ పెట్టింది పేరని.. పటమట వాసులకు అందుబాటులో ఉండేలా దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రియ ఫుడ్స్ డీజేఎం ఆర్ఎన్ ప్రసాద్ తెలిపారు. 35 రకాల పచ్చళ్లు , 45 రకాల మసాలాలతో పాటు చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు సైతం అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజర్ శేఖర్, ప్రియ ఫుడ్స్ ఏఎస్ఎం శ్రీధర్ రెడ్డి, ఏఆర్సీటి వర్మ పాల్గొన్నారు.
విజయవాడలో ప్రియ ఫుడ్స్ నూతన దుకాణం ప్రారంభం - ప్రియా ఫుడ్స్ నూతన దుకాణం ప్రారంభం
విభిన్న రుచులను అందిస్తూ ప్రజలకు చేరువైన ప్రియ ఆహార ఉత్పత్తుల సంస్థ మరో ముందడుగు వేసింది. విజయవాడలో రెండో దుకాణాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలకు మరింత చేరువైంది.
ప్రియా ఫుడ్స్ నూతన దుకాణం ప్రారంభం