ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోం ఐసోలేషన్​లో ఉన్న కరోనా బాధితులకు ప్రైవేటు వైద్యుల సేవలు

కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరంలో కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తున్న తరుణంలో వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటు డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కరోనా బాధితులు వైద్య సలహాలు, సూచనల కోసం తాము ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

privates doctors self service to corona patienst in vijayawada
హోం ఐసోలేషన్​లో ఉన్న కరోనా బాధితులకు ప్రైవేటు వైద్యుల సేవలు

By

Published : Jul 23, 2020, 12:54 PM IST

కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరంలో కరోనా ఉద్ధృతంగా విస్తరిస్తున్న తరుణంలో వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటు డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. హోం ఐసోలేషన్​లో ఉండి వైద్యసేవలు కావాలనుకునేవారు వీడియో కాల్ ద్వారా తమను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అమ్మన్న, ఊపిరితిత్తుల నిపుణులు శివప్రసాద్ రెడ్డి, జనరల్ మెడిసిన్ వైద్యులు రాజారావు, ధనుంజయ, నేహ, సుబ్బారావులు కలెక్టర్ ఇంతియాజ్​ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు.

బాధితుల కోసం హెల్ప్​లైన్ నెంబర్లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని.. పాజిటివ్ నిర్ధరణ అయితే ఆ రిపోర్టుతో తమను వీడియో కాల్​లో సంప్రదిస్తే వైద్య సలహాలు ఇస్తామని డాక్టర్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు వైద్యులు సహాయం చేసేందుకు ముందుకురావడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం తరఫున హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటుచేశామని.. ఏమైనా సందేహాలు ఉంటే అందులో సంప్రదించవచ్చని సూచించారు.

ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్: 94910 52800

ప్రైవేటు వైద్యుల హెల్ప్ లైన్ నెంబర్లు..

ABOUT THE AUTHOR

...view details