ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫుల్లుగా మందేశాడు.. బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడు.. ప్రయాణికులు ఏం చేశారంటే? - కృష్ణా జిల్లాలో ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు డ్రైవర్​ నిర్వాకం

Drunk and drive: ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు డ్రైవర్​ మద్యం తాగి బస్సు నడిపిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులకు ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Drunk and drive
మద్యం మత్తులో బస్సు నడిపిన డ్రైవర్​

By

Published : Mar 21, 2022, 12:14 PM IST

Drunk and drive: మద్యం మత్తులో బస్సు నడుపుతున్నాడంటూ... ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్‌పై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌ వెళ్తోంది. డ్రైవర్‌ మద్యం మత్తులో ఊగిపోతూ నడుపుతున్నట్లు గుర్తించిన ప్రయాణికులు.. మార్గమధ్యంలో నూజివీడు పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు.

నూజివీడు పీజీ సెంటర్‌ వద్ద పోలీసులు బస్సును ఆపి.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి ఓ డ్రైవర్‌ పరారయ్యాడు. మరొకరిని పరీక్షించిన పోలీసులు.. మద్యం తాగినట్లు గుర్తించి స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Theft in New House: ఆ ఇంట్లో అణా కూడా దొరకదు.. అయినా దోచుకెళ్లారు

ABOUT THE AUTHOR

...view details