విజయవాడ అజిత్సింగ్ నగర్ రాజీవ్ నగర్లో.. మహిళలు ఆందోళనకు దిగారు. ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్ ప్రమోటర్లుగా పని చేసిన తమ ఖాతాల్లో డబ్బులు మాయం అవ్వటంపై.. సదరు కంపెనీకి చెందిన వ్యక్తిని నిలదీశారు. తమ ఖాతాలోని డబ్బులను టీం లీడరే డ్రా చేసుకున్నాడని మహిళలు ఆరోపించారు.
'మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు' - agithsing nagar ladies agitation
కరోనా సమయంలో కష్టపడ్డాం... ఇంటింటికి తిరిగి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశాం... తిరిగిన కష్టానికి ఫలితం వచ్చిందని అనుకుని సంబరపడ్డాం... అకౌంట్లలలో డబ్బులు పడ్డాయని ఆనందం పడ్డాం. కానీ ఆ డబ్బులను కంపెనీ వాళ్లే డ్రా చేసేసుకున్నారు... ఇదేంటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండంటున్నారని.. ఓ ప్రైవేటు సంస్థలో ప్రమోటర్లుగా పనిచేసిన మహిళలు వాపోయారు.
కరోనా సమయంలోనూ ఇంటింటికీ తిరిగి కంపెనీ తరఫున ప్రమోట్ చేశామనీ.. కంపెనీ వాళ్లే బ్యాంకు ఖాతాలు తెరిచి.. ఏటీఎం కార్డు, బ్యాంకు పుస్తకాలను తమ వారి వద్దే ఉంచుకున్నారని బాధిత మహిళలు వివరించారు. కొవిడ్ సమయంలో పని చేసినందుకు నగదు వస్తుందని కంపెనీ వాళ్లు చెప్పారన్నారు. తమ ఖాతాల్లో 10 వేల కంటే ఎక్కువే జమ అయ్యిందనీ... రాత్రి ఖాతాల్లో జమ అయిన నగదను ఉదయం డ్రా చేసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని కంపెనీ ప్రతినిధులను అడిగితే మీకు సంబంధం లేదని అంటున్నారని బాధిత మహిళలు వాపోయారు.
ఇదీ చదవండి:'1048 మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సినేషన్'