ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PRISONER ESCAPE: ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ముద్దాయి పరారీ - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన ఓ ఖైదీ పరారయ్యాడు. నిందితుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నారు.

PRISONER ESCAPE
PRISONER ESCAPE

By

Published : Oct 6, 2021, 7:57 PM IST

చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చిన రిమాండ్‌ ముద్దాయి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. చిలకలపూడి సీఐ అంకబాబు తెలిపిన వివరాల మేరకు జంగారెడ్డిగూడెంకు చెందిన అబ్బుదాసరి బాలుప్రసాద్‌ అలియాస్‌ బాలు వివిధ దొంగతనాల కేసులకు సంబంధించి నూజివీడు సబ్‌జైలులో ఉన్నాడు. అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలు ఉండటంతో చికిత్స నిమిత్తం గన్నవరం పోలీసులు రిమాండ్‌ ముద్దాయిగా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొవిడ్‌వార్డులో చికిత్స పొందుతున్న అతను మంగళవారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో గార్డులుగా ఉన్న కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుళ్లను ఏమార్చి వార్డు నుంచి పరారయ్యాడు.

జంగారెడ్డిగూడెం, ఆగిరిపల్లి, నూజివీడు, గన్నవరం స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో నిందితునిగా ఉన్న అతన్ని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. బాలుప్రసాద్‌ ఆచూకీ తెలిస్తే డయల్‌ 100కు లేదా చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

ABOUT THE AUTHOR

...view details