ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ర్పే వాడారన్నారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని వ్యాఖ్యనించారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ..ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదన్నారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని ఆక్షేపించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని..,కానీ ఎవరికీ నష్టం కలగకుండా శాంతియుత వాతావరణంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు.
మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ - Modi comments on AP bifurcation
13:14 February 08
ఆంధ్రప్రదేశ్ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
"మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ర్పే వాడారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనం. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. శాంతియుత వాతావరణంలో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరికాదు. సరిగ్గా విభజన చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావు."- నరేంద్ర మోదీ, ప్రధాని
ఇదీ చదవండి