కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. కానుకలు రూపంలో భక్తులు పెద్ద మొత్తంలో బంగారాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అయితే దేవుడికి చెందాల్సిన కానుకలను ఓ పూజారి కాజేశారు. ఉప ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగించారు. భక్తులు ఇచ్చిన బంగారు కానుకలను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆదివారం దేవాలయానికి వచ్చిన భక్తుల బంగారు ఉంగరం పోయిందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే క్రమంలో పూజారి మర్రిబోయిన ద్వారకరావు కొన్ని బంగారు వస్తువులను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. దీంతో అతనిని ప్రశ్నించగా తన వద్దే ఉన్నాయని సమాధానం ఇచ్చాడని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఆలయ అధికారులు వెంటనే విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారిని విధుల నుంచి తొలగించారు. అతనికి సహకరించిన మరో ఇద్దరికి, ఆలయ ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేశారు.
కానుకలు అమ్మవారివి.. కాజేస్తోంది "అయ్యవారు.."
భక్తులు ఎంతో నమ్మకంతో స్వామికి సమర్పించుకుంటున్న కానుకలను ఓ పూజారి కాజేస్తున్నారు. కృష్ణా జిల్లా శ్రీ తిరుపతమ్మ ఆలయంలో పూజారి చేతివాటాన్ని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పసిగట్టారు. విధుల నుంచి తప్పించారు.
పూజారి చేతివాటాన్ని పసిగట్టిన ఆలయ అధికారులు