ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'60 శాతం హోటల్స్ నష్టాల్లో ఉన్నాయి...ఆదుకోండి' - vijayawada latest updates

కరోనా, రాజధాని మార్పు అంశం హోటల్ రంగం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెబుతున్నారు. ప్రస్తుతం 60 శాతం హోటళ్లు నష్టాల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఇండస్ట్రీయల్ స్టేటస్​లోకి తీసుకుని రాయితీలు కల్పించాలని, సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.

బాలకృష్ణరెడ్డి
బాలకృష్ణరెడ్డి

By

Published : Aug 26, 2021, 4:11 PM IST

మాట్లాడుతున్న బాలకృష్ణారెడ్డి

నిత్యం రద్దీగా ఉండే హోటళ్లు.. కరోనా కాలంలో నిర్మానుష్యంగా మారాయి. కొవిడ్ కారణంగా హోటల్ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి తెలిపారు. విద్యుత్ బిల్లు, ఆస్థి పన్ను నిర్వహణ చేయలేక హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వ్యాపారం జరుగుతుందన్న ఆయన... ఒకవైపు రాబడి లేక నష్టపోతున్న తమపై బిల్లుల భారం పడటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా హోటళ్లు ఉన్నాయని, వీటిలో 3 వేల హోటళ్లకు సభ్యత్వం ఉందన్నారు. హోటళ్లకు ఇండస్ట్రీయల్ హోదాను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండస్ట్రీయల్ హోదాతో పన్నుల్లో రాయితీ లభిస్తుందన్నారు.

సింగిల్ విండో ద్వారా తమకు అనుమతులు వస్తాయన్నారు. హోటళ్లలో సిబ్బంది సమస్య అధికంగా ఉందన్న వారు ప్రభుత్వం జిల్లాల్లో హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలలను ఏర్పాటు చేస్తే నిపుణులైన సిబ్బందిని నియమించే అవకాశం ఉందని... కొందరు హోటళ్లను లీజుకు తీసుకుని నిర్వహణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో ఆర్ధికంగా నష్టపోవటంతో .. తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా హోటల్ రంగంపై 3 లక్షల మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారని .. కొవిడ్ కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని చెబుతున్నారు.

ఆన్ లైన్ ద్వారానే ప్రస్తుతం రాబడి వస్తుందని స్విగ్గీ, జుమాటో తరహాలో యుంజీ అనే నూతన యాప్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చదవండి:

సీఎం సిమ్లా టూర్.. ఐదు రోజులు అక్కడే..!

ABOUT THE AUTHOR

...view details