ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దు: రాష్ట్రపతి ముర్ము

President Draupadi Murmu Comments : తెలంగాణ పోరాట యోధులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో రాష్ట్రపతి ముఖాముఖిలో పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేశవ్ మెమోరియల్ సొసైటీ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల కోసం వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ద్రౌపది ముర్ము విద్యార్థులకు సూచించారు.

President Draupadi Murmu Comments
President Draupadi Murmu Comments

By

Published : Dec 27, 2022, 3:25 PM IST

President Draupadi Murmu Comments : ఏ రంగంలోనైనా ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. తెలంగాణలోని నారాయణగూడ కేశవ్‌ మెమోరియల్‌ కళాశాలలో విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు.. ఈటల రాజేందర్‌, డి.కె.అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి విద్యార్థులతో మాట్లాడారు.

మన విశిష్ఠ సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దని సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అన్నారు. గ్రామం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయొద్దని తెలిపారు. సంస్కృతి పరిరక్షణ హక్కును కూడా రాజ్యాంగం మనకు కల్పించిందని గుర్తు చేశారు.

''మన దేశంలో ప్రతి ఊరికి గ్రామదేవత రక్షణగా ఉంటుంది. మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే విలువలు నేర్పాలి. మన రాజ్యాంగం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించింది. అన్ని విషయాలను అమెరికాతో పోల్చుకోవద్దు.'' - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

భారత్‌లో ఉన్నంతస్థాయిలో అమెరికాలో జనాభా లేదని తెలిపారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలో లేవని చెప్పారు. ఒక వ్యక్తి చదివితే ఆ కుటుంబానికే ఉపయోగమన్న రాష్ట్రపతి.. కానీ మహిళలు చదివితే దేశానికే ఉపయోగం అని గాంధీజీ చెప్పారన్నారు. పెరుగుతున్న యువ జనాభా భారత్‌కు మరింత సానుకూలమని వివరించారు.

''నూతన విద్యా విధానం సృజనాత్మకతను మేల్కొలుపుతుంది. దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇంప్రూవ్​మెంట్ కోసం అనువైన విధానమిది. ప్రతి అంశంపై అవగాహన పెంచుకునేందుకు ఎక్కువగా చదవాలి. హైదరాబాద్ అవకాశాలకు కేంద్రంగా ఉంది.. వాటిని అందిపుచ్చుకోవాలి.'' - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతి మరవొద్దు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details