కృష్ణా జిల్లా మైలవరం మండలం జంగాలపల్లిలో నవ శిశువు సహా తల్లి మృతిచెందిన ఘటనలో.. కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈనెల 18న కంభంపాటి కుసుమ అనే మహిళ పురిటి నొప్పులతో మైలవరం ప్రభుత్వాసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. విజయవాడ తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యురాలు శిరీష సూచించారు.
తల్లీబిడ్డను విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా శిశువు మృతిచెందాడు. తల్లి చికిత్స పొందుతూ ఈనెల 22న చనిపోయింది. అయితే వారి మృతికి మైలవరం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ నేడు ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో బంధువులు ఆందోళన చేశారు.
మేం జాగ్రత్తలు తీసుకున్నాం