వైద్యుల నిర్లక్ష్యం... నడిరోడ్డుపైనే గర్భిణీ ప్రసవం..! - latest news of krishna dst pregnant women cases
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించిన హృదయవిదారకర ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది. స్థానికుల సాయంతో ఆ మహిళకు కాన్పు జరిపారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్లు లేకుండా కాన్పు చేయమని వైద్యులు తెలపటంతో ఆమె నడుచుకుంటూ బయలుదేరింది. మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువై ఇలా జరిగిందని 108 సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.