తెలంగాణ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన శ్రవణ్‌కుమార్.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నివాసముంటూ ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణప్రియ అనే యువతితో ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కృష్ణప్రియ బుధవారం.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. అత్తింటి వారే చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రేమ వివాహం.. కొద్దినెలల్లోనే గర్భవతి బలవన్మరణం - హైదరాబాద్‌లో గర్భవతికి వరకట్న వేధింపులు వార్తలు
వరకట్న వేధింపులతో గర్భవతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్లో జరిగింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గర్భవతి బలవన్మరణం
ప్రస్తుతం ఆమె గర్భవతి అని.. గత రెండు నెలలుగా భర్త, అత్త, మామ వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారంటూ కృష్ణప్రియ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త శ్రవణ్‌కుమార్, అత్త మీనాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండిఃవాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఈనెల 23నాటికి తీరం దాటే అవకాశం