ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న తిట్టాడని మనస్థాపంతో.. నిండు గర్భిణి ఆత్మహత్య - గర్భిణీ ఆత్మహత్య వార్తలు

విశ్రాంతి కోసం.. ఓ నిండు గర్భిణి పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజుల్లో తను అమ్మా అని పిలుపించుకుంటా అని ఆశపడింది. సరదాగా ఇంట్లో అందరితో మాట్లడేది. కానీ ఉన్నట్టుండి ఏదో విషయంలో అన్నకు, ఆమెకు మధ్య గొడవైంది. అతని మాటలకు మనస్థాపం చెంది... ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో జరిగింది.

pregnant suicide at vakkalagadda
గర్భిణీ ఆత్మహత్య

By

Published : Aug 2, 2021, 9:55 AM IST

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో అన్న తిట్టాడని మనస్థాపంతో... ఓ నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మెరైన్ కానిస్టేబుల్ గోరిపర్తి పాండురంగారావు కుమార్తె నాగ భార్గవికి పదిహేను నెలల క్రితం హైదరాబాద్​లో చార్టెడ్ అకౌంటెంట్​గా పనిచేసే ...నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది. కొద్ది నెలలక్రితం భార్గవి గర్భం దాల్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తే.. ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అందుకే ఆమె వక్కలగడ్డలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది.

ఆదివారం ఉన్నట్టుండి భార్గవికి, ఆమె ఆన్న నిఖిల్​కు వాగ్వాదం జరిగింది. ఆతని మాటలకు మనస్థాపానికి గురైన ఆమె వంటింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడే ఇంటిలోకి వెళ్లిన తల్లి నాగలక్ష్మి ....నాగభార్గవి ఉరికి వేలాడుతుండటంతో హతాశురాలైంది. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే..ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందడంతో... తిరిగి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్ఐ. డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు..

ABOUT THE AUTHOR

...view details