ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్భిణీ అనుమానాస్పద మృతి..అత్తింటివారిపై అనుమానం! - machilipatnam

మచిలీపట్నానికి చెందిన 8 నెలల గర్భిణీ మరణం బంధువులను కలిచివేసింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, అత్త, మామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

8 నెలల గర్భణీ అనుమానాస్పద మృతి

By

Published : Jul 6, 2019, 12:14 PM IST

గర్భిణీ అనుమానాస్పద మృతి..అత్తింటివారిపై అనుమానం!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8 నెలల నిండు గర్భిణీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం...బందరుకోటకు చెందిన భార్గవికి ఏడాది క్రితం ఫణి రాజశేఖర్​తో వివాహం జరిగింది. భార్గవి మచిలీపట్నం ఆంధ్ర హాస్పటల్​లో స్టాఫ్ నర్స్​గా పని చేస్తోంది. భర్త ఫణి అదనపు కట్నం కోసం భార్గవిని వేధిస్తుండేవారని బంధువులు ఆరోపించారు. ఈ తెల్లవారు జామున ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయిందని ఫణి కుటుంబసభ్యులు తెలిపారు. భార్గవిని అత్తింటి వారే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని భార్గవి బంధువులు చెప్పారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details