విజయవాడలో..
అయోధ్యలో రామ మందిరం భూమి పూజ కార్యక్రమం సందర్భంగా విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ప్రాంతీయ ధర్మ ప్రచార సంరక్షకులు తోండేపు హనుమంతరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
భాజపా కార్యాలయాలంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. భాజపా యువమోర్చా అధ్యక్షులు రమేష్‌నాయుడు, పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాముడు పుట్టిన నేలలోనే ఎన్నో ఏళ్ల తర్వాత రామమందిరం నిర్మాణం జరగటం చాలా సంతోషకరమన్నారు.