కృష్ణా జిల్లాలో కరోనా రక్కసి పంజా విసురుతోంది. కొత్త కేసులు నమోదైన ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి సరైన పౌష్టికాహారం అందివ్వడం లేదన్న ఆరోపణలు రావడంతో.... అధికారులు అప్రమత్తమయ్యారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా....నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడలో క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారితో పాటు.... జిల్లా అధికార యంత్రాంగానికి కూడా ప్రణీత మహిళా పొదుపు సంఘం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఉండే ఈ సంఘం....మామూలు రోజుల్లో హోటల్ నడుపుతుండేది. లాక్ డౌన్ కారణంగా హోటల్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో....క్వారంటైన్ కేంద్రాల్లోని వారికి పౌష్టికాహారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు 630 మందికి పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నారు.
క్వారంటైన్ మోనూ: జీడిపప్పు...బాదంపప్పు...గుడ్లు..!
విజయవాడ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా అనుమానిత లక్షణాలున్న వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించి... మెరుగైన వసతులు కల్పించడంతో పాటు...పౌష్టికాహారాన్ని అందివ్వాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ తరుణంలో నగరానికి చెందిన ప్రణీత మహిళా పొదుపు సంఘం క్వారంటైన్ కేంద్రాలకు నాణ్యతలో రాజీ లేకుండా పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తోంది.
క్వారంటైన్లో నాణ్యమైన పౌష్టికాహారం