ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Prakasham Barrage 10 gates lifted and releases water to the bottom

పట్టిసీమతో పాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో 10 గేట్లును జలవరుల శాఖ అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 19 వేల క్యూసెక్కుల నీటిని యథాతధంగా కిందికి వదులుతున్నారు.

Prakasham Barrage 10 gates lifted and releases water to the bottom
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ-ప్రకాశం బ్యారేజీ 10గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

By

Published : Aug 13, 2020, 2:47 PM IST

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ-ప్రకాశం బ్యారేజీ 10గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

పట్టిసీమతో పాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో 10 గేట్లను జలవనరుల శాఖ అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 19 వేల క్యూసెక్కుల నీటిని యథాతధంగా కిందికి వదులుతున్నారు.

మొత్తం 10 గేట్లను ఎత్తి సముద్రంలోకి 7 వేల 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 10,600 వేల క్యూసెక్కుల నీటిని ఏలూరు, బందరు, రైవస్ కాలువల ద్వారా డెల్టా వ్యవస్థకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని యథాతథంగా దిగువకు పంపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details