ప్రకాశం బ్యారేజీకి క్రమంగా నీటి ప్రవాహం తగ్గుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 2,54,962క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి జారవిడుస్తున్నారు. 50గేట్లను 5అడుగుల మేర, 20గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
గేట్ల నుంచి 2,41,450క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. డెల్టాలోని కాలువల ద్వారా 13,500క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి ప్రకాశంబ్యారేజికి ఇంతే మొత్తంలో నీరు దిగువకు వస్తుంది. ఈ సాయంత్రానికి ప్రవాహాలు క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.