ప్రకాశం బ్యారేజీ వద్ద పడవను వెలికి తీసేందుకు జరుగుతున్న పనులను మంత్రి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్, జల వనరుల శాఖ అధికారులను అడిగి తెసుకున్నారు. పనులను బ్యారేజీ వద్దకు వచ్చి పరిశీలించారు. త్వరితగతిన బయటకు తీసి గేటు మూసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తుండగా... కాకినాడ, బళ్లారి, పులిచింతల నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి పడవను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ బోటును తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్ - collector
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతికి ఇరుక్కుపోయిన పడవ తొలగింపు పనులను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు.
![పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4231583-342-4231583-1566651960798.jpg)
మంత్రి అనిల్ కుమార్
పడవ తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి అనిల్
ఇది కూడా చదవండి.