ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టర్​కు పీపీఈ కిట్లు అందజేసిన స్వచ్ఛంద సంస్థ - కలెక్టర్​కు పీపీఈ కిట్లు అందజేసిన స్వచ్ఛంద సంస్థ

కోవిడ్-19 బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి అందించేందుకు 8 లక్షల రూపాయల విలువ చేసే వెయ్యి పీపీఈ కిట్లను సోషల్ సర్వీస్ సెంటర్ డైరక్టర్ పి థామస్.. కృష్ణా జిల్లా కలెక్టర్​కు అందజేశారు. కిట్లను అందజేసిన సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు.

కలెక్టర్​కు పీపీఈ కిట్లు అందజేసిన స్వచ్ఛంద సంస్థ !
కలెక్టర్​కు పీపీఈ కిట్లు అందజేసిన స్వచ్ఛంద సంస్థ !

By

Published : Jun 28, 2020, 4:13 PM IST

కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు, నర్సులకు అందించేందుకు వెయ్యి పీపీఈ కిట్లను సోషల్ సర్వీస్ సెంటర్ డైరక్టర్ పి థామస్.. కృష్ణా జిల్లా కలెక్టర్​కు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను, ప్రజలను ఆదుకోవడంలో సోషల్ సర్వీస్ సెంటర్ ముందుంటుందని ఆ సంస్థ డైరక్టర్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కోవిడ్-19 బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి 8 లక్షల రూపాయల విలువ చేసే వెయ్యి పీపీఈ కిట్లను అందించామన్నారు. ఈ పీపీఈ కిట్లలో హజ్మత్ సూట్ , ఒక జత సర్జికల్, ఫేస్ మాస్క్, గాగుల్స్, ఒక జత ఫుట్ కవర్స్, హెడ్ కవర్​లు ఉన్నాయన్నారు. కిట్లను అందజేసిన సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ఇంతియాజ్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details