పీపీఈ కిట్లు.. కరోనా వైరస్ సోకకుండా కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్న వైద్యులు పీపీఈ కిట్లు ధరిస్తున్నారు.ఆసుపత్రిలో ఉన్న రోగులను పరీక్షించినపుడు ,ఆపరేషన్ చేసేటప్పుడు తప్పకుండా ధరిస్తున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిచేప్పుడు వైద్యులు ,వైద్య సిబ్బందికి మహమ్మారి సోకకుండా.. పీపీఈ కిట్లు రక్షణ కవచాల్లా ఆడ్డుకుంటాయి. వాటిని తొలగించేటప్పుడు జాగ్రత్తలు వహించకపోతే కరోనా సోకే అవకాశాలున్నాయని ఐసీఎంఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. అందుకే పీపీఈ కిట్లను తొలగించే విధానంపై 18 నిబంధనలు పొందుపరిచినట్లు వైద్యులు చెబుతున్నారు.
తొలిగించేప్పుడు నిర్లక్ష్యం వహిస్తే అంతే.. - ppe kits disposal precautions
కోవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్యులందరూ తప్పనిసరిగా పర్సనల్ ప్రొటక్షన్ కిట్లను ధరించాలి. కరోనా రోగి నుంచి వైద్యునికి వైరస్ సోకకుండా పీపీఈ కిట్లు కీలకపాత్ర పోషిస్తాయి . అయితే వీటిని తొలగించేప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఎంతో హాని చేస్తాయి. చిన్న పొరపాటు జరిగినా వైరస్ వ్యాపిస్తుంది. మరి పీపీఈ కిట్లు తొలగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ నిబంధనలేమిటి?
విధులు ముగించుకుని వెళ్లేటప్పుడు పీపీఈ కిట్లను జాగ్రత్తగా ప్రత్యేక గదిలో నిపుణుల సూచన ప్రకారం తీసివేయాలని వైద్యులు చెపుతున్నారు. చేతులకు గ్లౌజ్ ఉంచుకునే శానిటైజ్ చేసుకోవాలి. అనంతరం పీపీఈ కిట్ ను మడుచుకుంటూ తీసివేయాలి. ఆ తర్వాత ముఖానికి ఉన్న కవర్ ను తీసివేయాలి. వరుసగా ఒక్కొక్కటి తీసివేసిన తర్వాత వాటిని పసుపు రంగు కవర్ లో ఉంచాలి. అనంతరం పసుపురంగు ఉన్న ప్రత్యేక చెత్తకుండీల్లో వేసి నిబంధనల ప్రకారం వాటిని నిర్వీర్యం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ: సీఎం జగన్